NEET 2025: నీట్ పరీక్షా పూర్తి వివరాలు 11 month ago
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. అన్ని వైద్య సంస్ధలలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విధానంలో ప్రవేశానికి ఒక సాధారణ మరియు ఏకరీతి జాతీయ అర్హత-కమ్-ప్రవేశ పరీక్ష నీట్ యూజీ. అన్ని వైద్య సంస్థలలో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యొక్క BAMS, BUMS మరియు BSMS కోర్సులలో ప్రతి విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి ఏకరీతి నీట్ యూజీ ఉంటుంది. నీట్ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియ ఉర్దూ. 2025 సంవత్సరానికి ఆర్మ్డ్, ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్‌లో నిర్వహించబడుతున్న బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశం కోరుకునే అభ్యర్ధులు కూడా నీట్ అర్హత సాధించాలి.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) - యూజీ ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష! మరోవైపు నీట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులను గుర్తించి .... దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 2024 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 91,927 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అందులో ప్రభుత్వ కళాశాలల్లో 48,012, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 43,915 సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను అన్ని రాష్ట్రాలు నేషనల్ పూల్‌కు ఇస్తాయి. వాటిని జాతీయ స్ధాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు కేటాయిస్తారు. జాతీయస్ధాయిలో రెండుసార్లు, కౌన్సిలింగ్ జరిగాక, నేషనల్ పూల్‌లో మిగిలిన సీట్లను తిరిగి ఆయా రాష్ట్రాలకు వెనక్కిస్తారు.
ప్రభుత్వంలోని సీట్లలో 15 శాతం అంటే 268 సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన 35 శాతం బీ కేటగిరీ కింద నిర్ణీత ఫీజుతో భర్తీ చేస్తారు. 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద తమకు ఇష్టమైన వారికి ప్రైవేట్ యాజమాన్యాలు కేటాయించుకునే వెసులుబాటుంది.
ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. జనరల్ కేటగిరీ అభ్యర్దులకు దరఖాస్తు రుసుం రూ. 1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్ధులకు రూ. 1600, ఎస్సీ, ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ / థర్డ్ జెండర్ అభ్యర్ధులకు రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు చెందిన అభ్యర్ధులైతే దరఖాస్తు రుసుం రూ. 9500 గా నిర్ణయించారు.
ఎబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 17.64 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాయగా... ఈ ఏడాది 18లక్షల మంది రాసే అవకాశం ఉందని ఓ అంచనా. నీట్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. అలాగే, అప్‌లోడ్ చేసిన ఫోటో కాపీని సైతం మీ వద్దే ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్లు తర్వాత అవసరమవుతాయి.
ఇది చదవండి: Dr.B.R.Ambedkar Open University-దూరవిద్యలో యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు